Skip to main content

యూఏఈలో మూడో అధికార భాషగా హిందీ

యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ)లో న్యాయస్థానాల్లోని కార్మిక కేసుల్లో హిందీని మూడో అధికార భాషగా అమలు చేయనున్నారు.
న్యాయవ్యవస్థలో విభిన్న భాషల అమలు కోసం 2018 నవంబర్‌లో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయశాఖ తెలిపింది. దీంతో న్యాయస్థానాల్లోని కార్మిక కేసులకు సంబంధించిన క్లెయిమ్ షీట్‌లు, ఫిర్యాదులు సమస్యల దరఖాస్తులను అరబిక్, ఆంగ్లంతోపాటుగా హిందీలో రాసే అవకాశం దక్కనుంది. యూఏఈ జనాభా సుమారు 50 లక్షలు కాగా.. వీరిలో భారత్ నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు 30 శాతం మంది ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మూడో అధికార భాషగా హిందీ
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎక్కడ : యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ)
Published date : 11 Feb 2019 05:19PM

Photo Stories