యూఏఈ క్రికెట్ డెరైక్టర్‌గా రాబిన్ సింగ్
Sakshi Education
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ డెరైక్టర్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్ నియమితులయ్యారు.
ప్రస్తుత ప్రధాన కోచ్ డగ్ బ్రౌన్‌ను ఆ పదవి నుంచి తొలగించిన యూఏఈ క్రికెట్ రాబిన్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. 1989 నుంచి 2001 మధ్యకాలంలో రాబిన్ సింగ్ భారత్ తరఫున ఒక టెస్టు, 136 వన్డేల్లో బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చాంపియన్ జట్టు ముంబై ఇండియన్స్, కరీబియన్ క్రికెట్ లీగ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు శిక్షణ బృందంలో సభ్యుడిగా ఉన్నాడు.
మరోవైపు యూఏఈ క్రికెట్ కష్టకాలంలో ఉంది. ఇటీవల యూఏఈ క్రికెట్‌ను మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం కుదిపేసింది. ఫిక్సింగ్‌లో భాగమైన కెప్టెన్ మొహమ్మద్ నవీద్‌తోపాటు పలువురు సీనియర్ క్రికెటర్లపై వేటు కూడా పడింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : రాబిన్ సింగ్

Published date : 13 Feb 2020 05:49PM