Skip to main content

యస్ బ్యాంకుపై మారటోరియం విధింపు

కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మారటోరియం విధించింది.
Current Affairsమార్చి 5 నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఏప్రిల్ 3 దాకా కొనసాగుతుందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఖాతాదారులకు నెలకు రూ.50,000 మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు వీలుంటుందని తెలిపింది. వైద్యం, ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది.

అడ్మినిస్ట్రేటర్‌గా ప్రశాంత్ కుమార్
యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్‌బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్‌బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై మారటోరియం విధింపు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : యస్ బ్యాంకుకు విశ్వసనీయమైన పునరుద్ధరణ ప్రణాళిక లేనందున
Published date : 06 Mar 2020 05:46PM

Photo Stories