యాప్ రుణాలపై ఏర్పాటైన ఆర్‌బీఐ ప్యానెల్ అధ్యక్షుడు ఎవరు?
Sakshi Education
సక్రమ మార్గంలో డిజిటల్ లెండింగ్ (డిజిటల్ మార్గాల్లో రుణాల వ్యాపారం) ప్రోత్సాహానికి అవసరమైన నియంత్రణ చర్యలను సూచించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జనవరి 13న ఓ అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఆన్‌లైన్, యాప్‌ల ద్వారా అధిక వడ్డీ రేట్లకు రుణాలను మంజూరు చేస్తూ, తర్వాత వసూళ్ల కోసం వేధింపులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
ఆర్‌బీఐ అధ్యయన బృందానికి... ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయంత్ కుమార్‌దాస్ అధ్యక్షత వహించనున్నారు. బృందం మూడు నెలల్లోగా తన నివేదికను ఆర్‌బీఐకి సమర్పించనుంది. బృందంలో సభ్యులుగా ఆర్‌బీఐ అధికారులు అజయ్‌కుమార్ చౌదరి, పీ వాసుదేవన్, మనోరంజన్ మిశ్రాతోపాటు, మోనెక్సో ఫిన్‌టెక్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ మెహతా, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాహుల్ శశి ఉంటారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యాప్ రుణాలపై ఏర్పాటైన ఆర్‌బీఐ ప్యానెల్ అధ్యక్షుడిగా నియామకం
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయంత్ కుమార్‌దాస్
ఎందుకు : సక్రమ మార్గంలో డిజిటల్ లెండింగ్ (డిజిటల్ మార్గాల్లో రుణాల వ్యాపారం) ప్రోత్సాహానికి అవసరమైన నియంత్రణ చర్యలను సూచించేందుకు

Published date : 19 Jan 2021 05:58PM