యాంటీబాడీస్ వృద్ధిపై సీరోసెరాలజీ సర్వే
Sakshi Education
భారత ప్రజల్లో కరోనాకు విరుగుడుగా యాంటీబాడీస్ వృద్ధి అనే అంశంపై సీరోసెరాలజీ సర్వే నిర్వహిస్తోంది.
సీరోసెరాలజీ వివిధ నగరాల్లో..
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రజల్లో కరోనాకు విరుగుడుగా యాంటీబాడీస్ వృద్ధి అనే అంశంపై సర్వే
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : సీరోసెరాలజీ
దేశ ప్రజల్లో కరోనాకు విరుగుడుగా యాంటీబాడీస్ వృద్ధి వేగంగా జరుగుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. భవిష్యత్‌లో కరోనాను ఎదుర్కోవడంలో ఇది మంచి పరిణామమని నిపుణులు చెబుతున్నారు.
సర్వేలోని అంశాలు
సర్వేలోని అంశాలు
- పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే కరోనాను అత్యంత శక్తివంతంగా ఎదుర్కొంటున్నారు.
- లండన్ మహా నగరంలో సెరాలజీ సర్వే నిర్వహించగా కేవలం 17.5 శాతం మందికి మాత్రమే యాంటీబాడీస్ వృద్ధి చెందాయి.
- భారత్ లోని పుణే నగరంలో సర్వే నిర్వహించగా 51.5 శాతం మందికి యాంటీబాడీస్ వృద్ధి చెందాయి.
- ముంబైలోని ధారావితో పాటు పలు మురికివాడల్లో 6 వేలకు పైగా నమూనాలు సేకరించగా.. అందులో 57 శాతం మందికి వారికి తెలియకుండానే కరోనా సోకి నయమైంది.
సీరోసెరాలజీ వివిధ నగరాల్లో..
నగరం | యాంటీబాడీస్ శాతం |
ఢిల్లీ | 23 |
ముంబై స్లమ్స్ | 57 |
ముంబై నాన్ స్లమ్స్ | 16 |
పుణే | 51 |
బెర్హంపురం | 31 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రజల్లో కరోనాకు విరుగుడుగా యాంటీబాడీస్ వృద్ధి అనే అంశంపై సర్వే
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : సీరోసెరాలజీ
Published date : 20 Aug 2020 11:58AM