యాంటీ ట్యాంక్ గెడైడ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని కేకే రేంజ్‌లో అక్టోబర్ 1న చేపట్టిన ఈ ప్రయోగంలో దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఏటీజీఎం సమర్థంగా ఛేదించిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తెలిపింది. 2020, సెప్టెంబర్ 22న ఏటీజీఎంతో నిర్వహించిన తొలి పరీక్ష కూడా సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
120 ఎంఎం రైఫిల్డ్ గన్ ద్వారా...
ఏటీజీఎం టాండెమ్ హీట్ వార్‌హెడ్ సాయంతో పేలుళ్లకూ లొంగని విధంగా తయారైన వాహనాలపై దాడి చేస్తుంది.
- 1.5 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ప్రస్తుతం దీన్ని ఎంబీటీ అర్జున్ ట్యాంకులోని 120 ఎంఎం రైఫిల్డ్ గన్ ద్వారా పరీక్షిస్తున్నారు.
చదవండి: యాంటీ ట్యాంక్ గెడైడ్ క్షిపణి (ఏటీజీఎం)ని ఏయే సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : లేజర్ కిరణాలతో నడిచే యాంటీ ట్యాంక్ గెడైడ్ క్షిపణి (ఏటీజీఎం) ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ : కేకే రేంజ్, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర