Skip to main content

యాదాద్రిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభం

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటుచేసిన టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎంఎస్‌ఎంఈ-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభమైంది.
తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో కలిసి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు 2019, నవంబర్ 1న ఈ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... రూ.1,552 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 450 యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 19 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వాక్-టు-వర్క్ విధానంలో భాగంగా పార్కులోనే 192 ఎకరాల్లో హౌసింగ్ కాలనీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. పార్క్‌ను ప్రస్తుతం 440 ఎకరాల్లో ప్రారంభించినా భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లలోనూ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డ్రైపోర్టు రాబోతుందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎంఎస్‌ఎంఈ-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : దండుమల్కాపురం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
Published date : 02 Nov 2019 06:10PM

Photo Stories