Windows 11: మెక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆవిష్కరణ
Sakshi Education
ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ జూన్ 24న డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11 వర్షన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.
విండోస్ 10తో పోలిస్తే విండోస్ 11 లుక్ సరికొత్తగా ఉంది. స్నాప్ లే అవుట్, స్నాప్ గ్రూప్ సహా మల్టీ టాస్కింగ్‌కు విండోస్ 11లో వీలు కల్పించారు. ఆండ్రాయిడ్ యాప్‌లు కూడా ఆపరేట్ అయ్యేలా ఈ విండోస్-11ను మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చింది. విండోస్ 11 ఆవిష్కరణ సందర్భంగా సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలు ప్రజాదరణ పొందడంతో విండోస్.. ఆపిల్, గూగుల్ నుంచి గట్టి పోటీని మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటోందని అన్నారు.
ఉచితంగానే అప్‌గ్రేడ్...
ఉచితంగానే అప్‌గ్రేడ్...
విండోస్ 10 నుంచి విండోస్ 11కి ఉచితంగానే అప్‌గ్రేడ్ కావొచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. విండోస్ 11 వెర్షన్‌లో విండోస్ 10లో ఉన్న మాదిరిగా లైవ్ టైల్స్ లేవు. లైవ్ టైల్స్ లేకుండానే విండోస్ 11వర్షన్‌లో స్టార్ట్ మెనూ ఉంది. అదే విధంగా టాస్క్‌బార్‌లో ఐకాన్స్ స్థానాన్ని చివరి నుంచి మధ్యలోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. విండోస్ 10 ఓస్‌ను మైక్రోసాఫ్ట్ 2015లో అందుబాటులోకి తెల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరు సంవత్సరాల తర్వాత విండోస్ 11గా పిలిచే కొత్త ఓస్‌ను మైక్రోసాఫ్ట్ తాజాగా లాంచ్ చేసింది.
Published date : 25 Jun 2021 12:48PM