వ్యవస్థలోకి రాని నగదు 10720 కోట్లు : ఆర్ బీఐ
Sakshi Education
2016 నవంబర్ 8న నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) చేసేనాటికి వ్యవస్థలో రూ.500, రూ.1,000 నోట్లు రూ.15.41 లక్షల కోట్ల విలువ మేర చలామణిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తెలిపింది.
రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తం రూ.15.31 లక్షల కోట్లుగా ఉన్నాయని కేవలం రూ.10,720 కోట్లు మాత్రమే తిరిగి వ్యవస్థలోకి రాలేదని మార్చి 11న వివరించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం స్వల్పకాలంలో జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వానికి వివరించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెద్దనోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి రాని నగదు రూ.10,720 కోట్లు
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెద్దనోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి రాని నగదు రూ.10,720 కోట్లు
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
Published date : 12 Mar 2019 03:41PM