Skip to main content

వ్యాపారంలో ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ చైనా ఒప్పందం

అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విసృ్తతికి పరస్పర సహకారం లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్ ఆఫ్ చైనా (బీఓసీ) మార్చి 19న ఒప్పందం కుదుర్చుకున్నాయి.
దీంతో రెండు బ్యాంకుల క్లయింట్లు విసృ్తత స్థాయిలో సేవలనూ పొందవచ్చు. ఈ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా తమతమ మార్కెట్ల విసృ్తతికి రెండు బ్యాంకులూ వేర్వేరుగానూ తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఎస్‌బీఐకి షాంఘైలో బ్రాంచీ ఉంది. అలాగే మూలధనం పరిమాణం పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద బ్యాంక్ అయిన బీఓసీ ముంబైలో తన బ్రాంచీని విసృ్తతం చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ చైనా ఒప్పందం
ఎప్పుడు : మార్చి 19
ఎందుకు : అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విసృ్తతికి
Published date : 20 Mar 2019 05:04PM

Photo Stories