వ్యాక్సిన్ వచ్చాకే టోర్నమెంట్‌లు: ఎఫ్‌ఐహెచ్
Sakshi Education
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే అంతర్జాతీయ హాకీ టోర్నీలు జరుగుతాయని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) స్పష్టం చేసింది.

ఈ మేరకు వివిధ స్థాయిల్లో పోటీల పునరుద్ధరణ కోసం ‘ఐదు దశల ప్రక్రియ’ను అనుసరించబోతున్నామని ఎఫ్‌ఐహెచ్ మే 20న ప్రకటించింది. ఈ ప్రక్రియ చివరి మెట్టుకి చేరుకున్నాక మాత్రమే అంతర్జాతీయ హాకీ టోర్నీలు నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ‘ఈ సమయంలో హాకీ పునరుద్ధరణ చాలా తొందరపాటే అవుతుంది. ఆటను మళ్లీ పాత పరిస్థితుల్లో నిర్వహించేలా ఐదు దశల ప్రక్రియను పాటించబోతున్నాం. చివరి దశలో వ్యాక్సిన్ వచ్చాకే పోటీ ప్రపంచంలో మళ్లీ అడుగుపెడతాం. అయితే ఒక్కో దశ ఎన్ని రోజులుంటుందనేది మాత్రం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని ఎఫ్‌ఐహెచ్ వివరించింది. అంతర్జాతీయ హాకీ పునరుద్ధరించాక కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకే నడుచుకుంటామని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యాక్సిన్ వచ్చాకే టోర్నమెంట్‌లు
ఎప్పుడు : మే 20
ఎవరు : అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యాక్సిన్ వచ్చాకే టోర్నమెంట్‌లు
ఎప్పుడు : మే 20
ఎవరు : అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)
Published date : 21 May 2020 05:13PM