వ్యాక్సిన్ మిక్సింగ్‌తో మంచి ఫలితాలు: ఐసీఎంఆర్
2021, మే– జూన్ నెలల్లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం 18 మందికి రెండు డోసుల్లో ఒకటి కోవిషీల్డ్, రెండోది కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇచ్చి పరిశీలన జరిపారు. ఒకే రకం వ్యాక్సిన్ తీసుకున్న వారి కంటే ఈ రెండు రకాల టీకాలను తీసుకున్న వారిలో రోగనిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారైందని, యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందాయని అధ్యయనంలో తేలింది. ‘సెరెన్‌డీపీడీయస్ కోవిడ్–19 వ్యాక్సిన్ మిక్స్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఇండియా: సేఫ్టీ అండ్ ఇమ్యూనిటీ అసెస్‌మెంట్ ఆఫ్ ఎ హెటిరోలోగస్ రీజియమ్’’ పేరుతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు అనుమతి
అమెరికా దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్ కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆగస్టు 7న ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యాక్సిన్ మిక్సింగ్‌తో మంచి ఫలితాలు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)
ఎందుకు : కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కోవడానికి...