Skip to main content

వూహాన్‌లోనే కరోనా పుట్టిందని తెలిపిన చైనా వైరాలజిస్టు?

ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న కరోనా వైరస్ పుట్టింది వూహాన్‌లోని ప్రభుత్వ ప్రయోగశాలలోనేనని చైనాకి చెందిన వైరాలజిస్టు డాక్టర్ లి-మెంగ్ యాన్ సంచలన విషయాన్ని బయటపెట్టారు.
Current Affairs
దీనికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని ఆమె వెల్లడించారు. బ్రిటిష్ టాక్ షో ‘లూస్ వుమన్’ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమంలో డాక్టర్ యాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈమె హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వైరాలజీ, ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త. 2019, డిసెంబర్- 2020, జనవరిలో తొలిసారి, 2020, జనవరి మధ్యలో మరోమారు డాక్టర్ యాన్ చైనాలో న్యూమోనియాపై రెండు పరిశోధనలు చేశారు. తరువాత ఆమె హాంకాంగ్ నుంచి అమెరికా పారిపోయారు.

2024 చివరికి కూడా..
2024 ఏడాది చివరినాటికి కూడా ప్రపంచంలోని అన్ని దేశాల పౌరులకు వ్యాక్సిన్ అందటం కష్టమేనని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా చెప్పారు. అందరికీ వ్యాక్సిన్ అందించడానికి కనీసం 15 బిలియన్ డోసులు అవసరమవుతాయని చెప్పారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : వూహాన్‌లోనే కరోనా పుట్టిందని తెలిపిన చైనా వైరాలజిస్టు
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : డాక్టర్ లి-మెంగ్ యాన్
Published date : 15 Sep 2020 05:43PM

Photo Stories