Skip to main content

వుహాన్ ప్రాంతానికి 15 టన్నుల భారత్ మందులు

కోవిడ్-19 వైరస్ ప్రభావిత ప్రాంతమైన చైనాలోని వుహాన్ ప్రాంతానికి భారత్ సుమారు 15 టన్నుల మందులను పంపింది.
Current Affairsభారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన విమానంలో ఫిబ్రవరి 26న ఈ మందులను తరలించారు. విమానంలో మాస్కులు, గ్లోవ్‌‌స, ఇతర అత్యవసర వైద్య పరికరాలను పంపిస్తున్నట్లు భారత్ తెలిపింది. ఐఏఎఫ్ విమానం భారత్‌కు తిరిగొస్తూ చైనాలో ఉన్న భారతీయులను తీసుకురానుంది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు ఫిబ్రవరి 26న విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఫిబ్రవరి 25న 52 మంది కోవిడ్-19 (కరోనా వైరస్)కారణంగా మరణించారు. ఇప్పటివరకూ ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 2715కు చేరుకోగా, వ్యాధితో ఉన్న వారి సంఖ్య 78,064కు చేరింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వుహాన్ ప్రాంతానికి 15 టన్నుల మందులు
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : భారత్
ఎందుకు : కోవిడ్-19 వైరస్ బాధితుల కోసం
Published date : 27 Feb 2020 05:29PM

Photo Stories