వరల్డ్ వైడ్ వెబ్‌కు 30 సంవత్సరాలు
Sakshi Education
వరల్డ్ వైడ్ వెబ్(www)కు 30 సంవత్సరాలు నిండాయి. 1989 మార్చి 12న టిమ్ బెర్నర్స్‌లీ దీనిని కనుగొన్నారు.
ఈ సందర్భంగా టిమ్ మాట్లాడుతూ ద్వేషపూరిత ప్రసంగాలు, వ్యక్తిగత గోప్యత ఆందోళనలు, ప్రభుత్వాలే చేయిస్తున్న హ్యాకింగ్‌లు తదితర సమస్యలతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రస్తుత కాలంలో ఎంతో నొప్పిని, బాధను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కోరుకున్న వెబ్ ఇది కాదని అన్నారు. మానవాళి కోసం వరల్డ్ వైడ్ వెబ్‌ను ఉన్నతంగా మార్చాలని పిలుపునిచ్చారు.
Published date : 13 Mar 2019 03:52PM