వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ విజేతగా మొమోటా
Sakshi Education
సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, జపాన్ షట్లర్ కెంటో మొమోటా విజేతగా నిలిచాడు.
చైనాలోని గ్వాంగ్‌జౌలో డిసెంబర్ 15న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ మొమోటా 87 నిమిషాల్లో 17-21, 21-17, 21-14తో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. చాంపియన్ మొమోటాకు లక్షా 20 వేల డాలర్లు (రూ. 84 లక్షల 83 వేలు), రన్నరప్ జిన్‌టింగ్‌కు 60 వేల డాలర్లు (రూ. 42 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
అత్యధిక టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్
2019 ఏడాది మొమోటా 12 టోర్నీల్లో ఫైనల్స్ చేరగా... 11 టోర్నీల్లో టైటిల్స్ సాధించాడు. తద్వారా బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు లీ చోంగ్ వీ (మలేసియా), వాంగ్ జియోలి-యు యాంగ్ (చైనా) జంట పేరిట ఉండేది. 2010లో లీ చోంగ్ వీ సింగిల్స్ విభాగంలో 10 టైటిల్స్ నెగ్గగా... 2011లో వాంగ్ జియోలి-యు యాంగ్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో 10 టైటిల్స్ సాధించింది.
2019వ సంవత్సరం మొమోటా చైనా మాస్టర్స్, డెన్మార్క్ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, ప్రపంచ చాంపియన్‌షిప్, జపాన్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్, సింగపూర్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, జర్మన్ ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : కెంటో మొమోటా
ఎక్కడ : గ్వాంగ్‌జౌ, చైనా

Published date : 16 Dec 2019 05:43PM