Skip to main content

వరల్డ్‌ కార్‌ డిజైన్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2021 అవార్డును గెలుచుకున్న కారు?

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఎస్‌యూవీ మోడల్‌... ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కారుకు ‘‘వరల్డ్‌ కార్‌ డిజైన్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2021 అవార్డు’’ లభించింది.
Current Affairs
వరల్డ్‌ కార్‌ అవార్డుల జ్యూరీ ప్యానెల్లో 28 దేశాల నుంచి 93 మంది జర్నలిస్టులు ఈ డిఫెండర్‌ మోడల్‌కు ఓటు వేశారు. గడిచిన 12 నెలల్లో అత్యుత్తమ రూపకల్పన, అధునాతన సాంకేతిక ప్రమాణాలను పాటించి రూపొందించిన కార్లను గుర్తించి వరల్డ్‌ కార్‌ డిజైన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ను ప్రదానం చేస్తారు.

50 అంతర్జాతీయ అవార్డులు...
డిఫెండర్‌ కారు ఆవిష్కరణ నాటి నుంచి... టాప్‌ గేర్‌ 2020 కార్‌ ఆఫ్‌ ది ఇయర్, మోటార్‌ ట్రెండ్స్‌ 2021 ఎస్‌యూవీ, ఆటోకార్స్‌ బెస్ట్‌ ఎస్‌యూవీ 2020 అవార్డులతో సహా మొత్తం 50 అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. జేఎల్‌ఆర్‌ మోడళ్లకు అవార్డు దక్కడం మూడోసారి. ఇంతకు ముందు 2018 లో రేంజ్‌ రోవర్‌ వేలార్‌ మోడల్, 2012లో రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ మోడల్‌ ఈ అవార్డును దక్కించుకున్నాయి.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : వరల్డ్‌ కార్‌ డిజైన్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2021 అవార్డును గెలుచుకున్న కారు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఎస్‌యూవీ మోడల్‌... ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌
ఎందుకు : అత్యుత్తమ రూపకల్పన, అధునాతన సాంకేతిక ప్రమాణాలను కలిగి ఉన్నందుకు...
Published date : 23 Apr 2021 06:26PM

Photo Stories