వరదల కారణంగా 2,155 మంది మృతి
Sakshi Education
2019 ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల కారణంగా 2,155 మంది మృత్యువాతపడ్డారని, మరో 45 మంది గల్లంతయ్యారని కేంద్ర హోం శాఖ అక్టోబర్ 25న వెల్లడించింది.
మొత్తంగా 22 రాష్ట్రాలలో 26 లక్షల మందికి పైగా వరద ప్రభావానికి గురయ్యారని తెలిపింది. దేశవ్యాప్తంగా 351 జిల్లాల్లో వరద ప్రభావం ఉందని, మహారాష్ట్రలో అత్యధికంగా 430 మంది, ఆ తర్వాత బెంగాల్‌లో 227 మంది మృత్యువాతపడ్డారని పేర్కొంది.
Published date : 26 Oct 2019 05:51PM