Skip to main content

వరద నష్టంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలకు జరిగిన నష్టం, తీసుకున్న చర్యలు, అందించాల్సిన సాయం తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆగస్టు 27న జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, వ్యవసాయ, ఉద్యాన సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి నిర్ణయాలు..
  • పకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రస్తుతం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి
  • పంట నష్టాన్ని బ్యాంకులు మినహాయించుకోకుండా రైతుల అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకే ఇన్‌పుట్ సబ్సిడీ వేయాలి
  • విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను గుర్తించడానికి ప్రతి నియోజకవర్గంలో పరీక్ష కేంద్రాలు (ల్యాబ్స్) ఏర్పాటు చేయాలి. భూసార పరీక్షలను నిర్వహించాలి
  • కౌలు రైతులకు గ్రామ సచివాలయాల్లోనే కార్డులు ఇవ్వాలి. కౌలు రైతుల చట్టంపై అవగాహన కల్పించాలి.
  • పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే సలహాలు, పరిష్కారాల కోసం కాల్‌సెంటర్, ఒక యాప్‌ను సిద్ధం చేయాలని సీఎం నిర్ణయించారు.
  • వరద తాకిడికి గురైన ప్రాంతాలకు పూర్తి సబ్సిడీ(100 శాతం)పై వరి, మినుము, పెసర, మొక్కజొన్న విత్తనాలను ప్రభుత్వం అందజేయాలి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వరద నష్టంపై సమీక్ష
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్
Published date : 28 Aug 2019 05:46PM

Photo Stories