Skip to main content

వొడాఫోన్‌ ఐడియా చైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్న వ్యక్తి?

రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవి నుంచి కుమార మంగళం బిర్లా తప్పుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఆదిత్య బిర్లా గ్రూప్‌ నామినీ అయిన హిమాంశు కపానియా ఈ పదవిలో నియమితులైనట్లు ఆగస్టు 4న పేర్కొంది. లీజు బకాయిలు మొదలైనవన్నీ కలిపి 2021 మార్చి 31 నాటికి వీఐఎల్‌ స్థూల రుణభారం రూ. 1,80,310 కోట్లుగా ఉంది.

రాజ్యసభ సభ్యుడిగా జవహర్‌ సర్కార్‌...
ప్రసార భారతి మాజీ సీఈఓ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జవహర్‌ సర్కార్‌ ఆగస్టు 4న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆయన ఇటీవలే ఎగవసభ సభ్యుడిగా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యారు.

ప్రశాంత్‌ కిశోర్‌ రాజీనామా...
పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్య సలహాదారు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటించారు. ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 5న ఆయన సీఎంకు లేఖ రాశారు. అమరీందర్‌ సీఎంగా కొనసాగినంత కాలం ఆయన ముఖ్య సలహాదారుగా నెలకు రూ.1 గౌరవ వేతనంపై పనిచేస్తారని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : వొడాఫోన్‌ ఐడియా నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్న వ్యక్తి?
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : కుమార మంగళం బిర్లా
ఎందుకు : వొడాఫోన్‌ ఐడియా రుణ సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో...
Published date : 07 Aug 2021 12:42PM

Photo Stories