వనపర్తిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ
Sakshi Education
తెలంగాణలోని వనపర్తి ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఏర్పాటుచేసేందుకు డీఎక్స్‌ఎన్ సంస్థ అంగీకారం తెలిపిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.
దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సాధారణంగా పండించే పంటలతో అనేక రకాల ఆహార ఉత్పత్తులు ప్రోత్సహిస్తూనే.. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంట ఉత్పత్తులకు రైతులకు ప్రోత్సాహం అందిస్తామని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : డీఎక్స్‌ఎన్ సంస్థ
ఎక్కడ : వనపర్తి, తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : డీఎక్స్‌ఎన్ సంస్థ
ఎక్కడ : వనపర్తి, తెలంగాణ
Published date : 17 Apr 2019 05:41PM