Skip to main content

వంటగ్యాస్ వినియోగంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?

దేశవ్యాప్తంగా అత్యధికంగా వంట గ్యాస్ (ఎల్పీజీ, బయో గ్యాస్) వినియోగిస్తున్న కుటుంబాలు ఉన్న రాష్ట్రాల్లో <b> గోవా మొదటి స్థానం</b>లో నిలిచింది.
Current Affairs గోవాలో 83.6 శాతం కుటుంబాలు వంటగ్యాస్‌ను వినియోగిస్తూ కాలుష్య రహిత వాతావరణంలో జీవిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మొదటి దశలో 17 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వంట గ్యాస్ సర్వే నిర్వహించారు. రెండో దశ సర్వే నివేదికను 2021 ఏడాది విడుదల చేయనున్నారు.

తొలిదశ సర్వేలోని అంశాలు...
  • గోవా తర్వాత 91.8 శాతం కుటుంబాలకు వంటగ్యాస్‌తో తెలంగాణా రెండో స్థానంలో నిలిచింది.
  • 83.6 శాతం కుటుంబాలకు వంటగ్యాస్‌తో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకుంది.
  • 83.8 శాతం కుటుంబాలకు వంటగ్యాస్ ఉన్న మిజోరాం నాలుగో స్థానంలో ఉంది.
  • ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికీ 45 శాతం కంటే తక్కువ కుటుంబాలు వంటగ్యాస్ వినియోగిస్తున్నాయి.
  • నాగాలాండ్‌లో 43 శాతం, అస్సోంలో 42.1 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 40.2 శాతం, బిహార్‌లో 37.8శాతం, మేఘాలయలో 33.7 శాతం కుటుంబాలే వంటగ్యాస్ వినియోగిస్తున్నాయి.
పారిశుధ్యంలో లక్షద్వీప్‌కు తొలిస్థానం...
కుటుంబ పారిశుధ్య పరిస్థితుల సూచీలో లక్షద్వీప్ మొదటిస్థానం సాధించింది. అక్కడ 99.8 శాతం కుటుంబాలు మెరుగైన పారిశుధ్యం పాటిస్తున్నాయి. రెండో స్థానంలో ఉన్న కేరళలో 98.7 శాతం కుటుంబాలు మెరుగైన పారిశుధ్య పరిస్థితుల్లో జీవిస్తున్నాయి. పారిశుధ్యంలో బిహార్, లద్దాఖ్ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వంటగ్యాస్ వినియోగంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : గోవా
ఎక్కడ : దేశంలో
ఎందుకు : 83.6 శాతం కుటుంబాలు వంటగ్యాస్‌ను వినియోగిస్తున్నందున
Published date : 19 Dec 2020 07:35PM

Photo Stories