వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్
Sakshi Education
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)కు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు బ్రిటన్‌లో మార్చి 20న అరెస్ట్ చేశారు.
అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆయనను హాజరుపరచగా, కోర్టు ఆయనకు మార్చి 29 వరకూ కస్టడీ విధించింది. స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు మాట్లాడుతూ..భారత అధికారుల విజ్ఞప్తి మేరకు నీరవ్‌ను హోల్‌బోర్న్ ప్రాంతంలో అరెస్ట్ చేశామని తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలుచేసిన పిటిషన్ ఆధారంగా లండన్‌లోని ఓ కోర్టు నీరవ్ అరెస్ట్‌కు వారెంట్ జారీచేసిందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు
ఎక్కడ : బ్రిటన్
ఎందుకు : పీఎన్‌బీకు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టిన కేసులో
క్విక్ రివ్యూ :
ఏమిటి : వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు
ఎక్కడ : బ్రిటన్
ఎందుకు : పీఎన్‌బీకు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టిన కేసులో
Published date : 21 Mar 2019 05:16PM