Skip to main content

వియన్నా ఒప్పందాన్ని పాక్‌ ఉల్లఘించింది : ఐసీజే

పాకిస్తాన్ చెరలో ఉన్న మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) మరోసారి తీవ్రంగా తప్పుబట్టింది.
వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందంటూ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు ఐసీజే అధ్యక్షుడు అబ్దుల్‌ఖావీ యూసఫ్ విన్నవించారు. ఐరాస సాధారణ సభకు అక్టోబర్ 31న సమర్పించిన తన నివేదికలో పూర్తి వివరాలను అందించారు. 2019, జులై 17న ఇచ్చిన తీర్పులో ఇదే విషయాన్ని తెలిపామన్న యూసఫ్.. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36ను పాకిస్తాన్ ఉల్లంఘించిందని తెలిపారు.

గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాదవ్‌ను 2016లో పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. అనంతరం 2017లో పాక్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించగా.. నెదర్లాండ్స్ లోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ సవాల్ చేసింది. ఈ కేసులో వాదనల అనంతరం ఉరిశిక్షను పునఃసమీక్షించాలంటూ 2019, జులై 17న ఐసీజే తీర్పు ఇచ్చింది. ఆయన నిర్బంధాన్ని తప్పుబట్టిన కోర్టు.. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పాక్‌ను ఆదేశించింది.
 
కులభూషణ్‌ జాదవ్‌ కేసుకు సంబంధించిన మరిన్ని సమగ్ర కథనాల కోసం ఈ క్రింది లింక్‌పై క్లిక్‌ చేయండి.
 
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించింది
ఎప్పుడు : అక్టోబర్‌ 30
ఎవరు : అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) అధ్యక్షుడు అబ్దుల్‌ఖావీ యూసఫ్‌
ఎక్కడ : భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ కేసులో
Published date : 31 Oct 2019 06:18PM

Photo Stories