Skip to main content

వివేకానంద రాక్ స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి

తమిళనాడులోని కన్యాకుమారిలో నిర్వహించిన స్వామి వివేకానంద రాక్ స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు.
Current Affairsఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ... భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన ప్రాంతం కన్యాకుమారి అని పేర్కొన్నారు. విశిష్టమైన ఆధ్యాత్మిక విప్లవానికి ఇక్కడి నుంచే స్వామి వివేకానంద నాంది పలికారన్నారు. మాతృదేశం పట్ల ప్రజల్లో ప్రేమ, మతపరమైన విలువలను లోకానికి ఆయన తెలియజేశారని చెప్పారు.

యూపీఐతో ఫాస్టాగ్ రీచార్జ్ : ఎన్‌పీసీఐ
నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్ రీచార్జ్ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని ఎన్‌పీసీఐ సీవోవో ప్రవీణ రాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
స్వామి వివేకానంద రాక్ స్వర్ణోత్సవాలు
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : కన్యాకుమారి, తమిళనాడు
Published date : 27 Dec 2019 05:39PM

Photo Stories