వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
Sakshi Education
విపక్ష సభ్యుల తీవ్ర ఆగ్రహావేశాల మధ్య మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెండు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు సెప్టెంబర్ 20న రాజ్యసభ ఆమోదం పొందాయి.
‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహం, సులభతరం)’ బిల్లు, రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లులను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లులు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం దాలుస్తాయి. ఈ బిల్లులకు జేడీయూ, వైఎస్సార్సీపీ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, టీఆర్‌ఎస్, ఆప్.. తదితర విపక్ష పార్టీలతో పాటు ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించింది.
చదవండి: వివాదాస్పద సాగు బిల్లులు-వివరాలు, బిల్లుల ఉద్దేశం
క్విక్ రివ్యూ :
ఏమిటి : వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : రైతుల ఆదాయం పెంచేందుకు
Published date : 21 Sep 2020 05:37PM