విత్తనం ఎంత కాలం బతుకుతుంది?
Sakshi Education
విత్తనం ఎంత కాలం బతుకుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ప్రయత్నిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విత్తనం ఎంత కాలం బతుకుతుంది అనే అంశంపై ప్రయెగాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : ఇక్రిశాట్ సహా ఆరు అంతర్జాతీయ సంస్థలు
ఇందుకోసం మరో ఆరు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ‘‘స్వాల్‌బోర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్’’లో పదమూడు రకాల విత్తనాలను వందేళ్ల ప్రయోగాల కోసం నిల్వ చేయనుంది.
ఇక్రిశాట్ ప్రయోగం-ముఖ్యాంశాలు
- భవిష్యత్తులో ప్రపంచం మొత్తమ్మీద ఏదైనా పంటను మళ్లీ పునరుద్ధరించేందుకు ఏం చేయాలన్నది ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుందని అంచనా.
- ఇక్రిశాట్‌తోపాటు ఇతర సంస్థల్లోని విత్తన జన్యుబ్యాంకులు ఈ ప్రయోగంలో పాల్గొంటున్నాయి.
- మొత్తం 13 రకాల విత్తనాలను స్వాల్‌బోర్డ్‌లోని విత్తన బ్యాంకులో నిల్వ చేయనుండగా ఇందులో నాలుగింటిని ఇక్రిశాట్ సమకూర్చనుంది.
- వేరుశనగ, జొన్న, కంది, శనగ పంటలను ఇక్రిశాట్ అందజేయనుంది.
- ప్రయోగం 2022-23లో మొదలవుతుంది.
- విత్తన బ్యాంకులో విత్తనాలను -18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తారు. పదేళ్లకు ఒకసారి విత్తనాలను వెలికితీసి పరిశీలించి మళ్లీ నిల్వ చేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విత్తనం ఎంత కాలం బతుకుతుంది అనే అంశంపై ప్రయెగాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : ఇక్రిశాట్ సహా ఆరు అంతర్జాతీయ సంస్థలు
Published date : 02 Sep 2020 05:10PM