విశ్వభారతి విశ్వవిద్యాలయ స్థాపకులు ఎవరు?
Sakshi Education
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్‌లో <b>రవీంద్రనాథ్ ఠాగూర్ 1921, డిసెంబర్ 23</b>న స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఏర్పాటైన ఉత్సవాలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 24న వర్చువల్ విధానం ద్వారా ప్రసంగించారు. భారత్‌తోపాటు ప్రపంచం సాధికారత సాధించాలని గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షించారనీ, అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం‘ఆత్మనిర్భర్ భారత్’ను ప్రకటించిందని మోదీ తెలిపారు.
రూ.59 వేల కోట్ల స్కాలర్‌షిప్...
షెడ్యూల్డ్ కుల(ఎస్‌సీ) విద్యార్థుల విద్యాభ్యాసం కోసం కేంద్ర కేబినెట్ డిసెంబర్ 23న కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో 4 కోట్లకు పైగా విద్యార్థుల కోసం రూ. 59,000 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా (35,534 కోట్లు) భరించనుండగా, మిగిలిన 40 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.

Published date : 25 Dec 2020 05:59PM