విశ్వాస పరీక్షలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విజయం
Sakshi Education
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 30న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.
288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ప్రభుత్వానికి మద్దతు పలికారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి(మహా వికాస్ ఆఘాడి) ప్రభుత్వంపై కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని సీనియర్ ఎన్సీపీ, సేన సభ్యులు బలపరిచారు. బీజేపీకి చెందిన 105 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా వేర్వేరు పార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా దూరంగా ఉన్నారని ప్రొటెం స్పీకర్ దిలీప్ వల్సే సభలో ప్రకటించారు. అనంతరం సభలో ఉన్న సభ్యులను లెక్కించి ఉద్ధవ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వానికి 169 మంది అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.
అసెంబ్లీలో బలాబలాలు..
మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యుల్లో అతిపెద్ద పార్టీ బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యుల బలముంది.
(చదవండి : ఉద్ధవ్ ప్రమాణం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు)
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహారాష్ట్ర శాసనసభ విశ్వాస పరీక్షలో విజయం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే

Published date : 02 Dec 2019 05:47PM