విశ్వాస పరీక్షలో గోవా ముఖ్యమంత్రి విజయం
Sakshi Education
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మార్చి 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.
విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. గోవా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 40 మంది కాగా.. ప్రస్తుతం అసెంబ్లీలో 36 మంది ఉన్నారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుండటం తెలిసిందే. ఇప్పటివరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పరీకర్ మార్చి 17న కన్నుమూశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా సావంత్ మార్చి 19న ప్రమాణ స్వీకారం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశ్వాస పరీక్షలో గోవా ముఖ్యమంత్రి విజయం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ప్రమోద్ సావంత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశ్వాస పరీక్షలో గోవా ముఖ్యమంత్రి విజయం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ప్రమోద్ సావంత్
Published date : 21 Mar 2019 05:18PM