విశాఖపట్నంలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం భీమిలి మండలం కాపులుప్పాడ వద్ద అదాని గ్రూప్ నిర్మించనున్న డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పార్కుకు సీఎం చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేశారు.
రుషికొండ వద్ద నూతనంగా నిర్మించిన మిలీనియం టవర్స్‌ను కూడా ప్రారంభించారు. మరోవైపు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టాటా మెమోరియల్ ట్రస్ట్ భాగస్వామ్యంతో రూ.600 కోట్లతో రాష్ట్రంలో 10 ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టినట్లు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. బసవతారకం ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తొలిదశలో భాగంగా 18 నెలల్లో 300 పడకలతో ఆస్పత్రిని పూర్తి చేస్తామని వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశాఖపట్నంలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : కాపులుప్పాడ, భీమిలి మండలం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశాఖపట్నంలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : కాపులుప్పాడ, భీమిలి మండలం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 15 Feb 2019 05:37PM