విశాఖలో డీఆర్‌డీవో డేటా సెంటర్
Sakshi Education
దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో డేటా సెంటర్‌ను ఏర్పాటుచేయనుంది.
ఈ మేరకు విశాఖ సమీపంలోని కాపులపాడు వద్ద 15 ఎకరాల ఏపీఐఐసీ భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఆర్‌డీవోకు కేటాయించింది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా రక్షణ రంగంలో సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేయడం ఈ డేటా సెంటర్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం డీఆర్‌డీవో చైర్మన్‌గా డాక్టర్ జి. సతీష్‌రెడ్డి ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డీఆర్‌డీవో డేటా సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)
ఎక్కడ : కాపులపాడు, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రక్షణ రంగంలో సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేందుకు

Published date : 02 Oct 2019 04:44PM