విశాఖ వేదికగా మిలాన్-2020 విన్యాసాలు
Sakshi Education
నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్ (బహుపాక్షిక నావికా విన్యాసాలు)కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదిక కానుంది.
విశాఖలోని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరంలో మిలాన్-2020 విన్యాసాలు నిర్వహించనున్నారు. మిలాన్-2020లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్‌లకు చెందిన 41 దేశాలకు ఆహ్వానాలు పంపింది. వివిధ దేశాల మధ్య స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తుంటారు.
1995లో తొలిసారి జరిగిన మిలాన్ విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో 16 దేశాలు పాల్గొన్నాయి. 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద మిలాన్‌గా చరిత్రకెక్కింది. 2018లో అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన విన్యాసాల్లోనూ 17 దేశాలు పాల్గొన్నాయి. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు చేయగా, 2001, 2016 సంవత్సరాల్లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లు నిర్వహించడం వల్ల మిలాన్ విన్యాసాలు జరగలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిలాన్-2020 విన్యాసాలు
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : భారత నౌకాదళం
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

Published date : 30 Nov 2019 05:37PM