Skip to main content

విశాఖ పోలీస్ స్టేషన్‌లో రోబో సేవలు

విశాఖపట్నంలోని మహారాణిపేట సిటీ పోలీస్ స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా రోబో (మిస్. సైబీరా రోబోకప్లర్)ను నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె. మీనా నవంబర్ 18న ప్రారంభించారు.
ఈ తరహా రోబోను దేశంలో మొదటి సారిగా విశాఖలో తయారు చేశారు. విశాఖలోని రోబో కప్లర్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ఈ రోబో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారికి పంపిస్తుంది. ఫిర్యాదుదారు ఫొటోనూ తీసుకుంటుంది. 24 గంటల్లో పరిష్కరించేందుకు సమయం ఇస్తుంది. తరువాత ఫిర్యాదు పరిష్కారం కాకుంటే నేరుగా సీఎం కార్యాలయానికి బదిలీ చేస్తుంది.
Published date : 19 Nov 2019 05:05PM

Photo Stories