విరాట్ కోహ్లికి మూడు ఐసీసీ అవార్డులు
Sakshi Education
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి మూడు ఐసీసీ అవార్డులు లభించాయి.
ఈ మేరకు జనవరి 22న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక పురస్కారాలు-2018లను ప్రకటించింది. ఈ పురస్కారాల్లో కోహ్లీని ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) వరుసగా రెండో ఏడాది వరించింది. అలాగే టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు దక్కాయి. దీంతో ఒకే సంవత్సరం ఐసీసీ మూడు ప్రధాన అవార్డులు పొందిన తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. మరోవైపు ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్ ద ఇయర్, వన్డే టీమ్ ద ఇయర్‌లకు కూడా కోహ్లినే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
విరాట్ కోహ్లీ 2018లో 13 టెస్టుల్లో 55.08 సగటుతో 5 సెంచరీలు సహా 1322 పరుగులు చేశాడు. అలాగే 14 వన్డేల్లో 133.55 సగటుతో 6 సెంచరీలు సహా 1202 పరుగులు సాధిండడంతోపాటు 10 అంతర్జాతీయ టి20ల్లో కలిపి 211 పరుగులు చేశాడు. కోహ్లి నాయకత్వంలో 2018లో భారత్ 6 టెస్టుల్లో గెలిచింది. 7 టెస్టుల్లో ఓడింది. వన్డేల్లో 9 విజయాలు నమోదు చేసింది. 4 పరాజయాలు చవిచూసింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది.
విశేషాలు...
ఎమర్జింగ్ క్రికెటర్‌గా పంత్...
టెస్టులు, వన్డేల్లో 2018లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వరించింది. అతను 8 టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించాడు.
అత్యుత్తమ ఇన్నింగ్స్...
హరారేలో జింబాబ్వేపై ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) చేసిన భారీ సెంచరీ టి20 అత్యుత్తమ ఇన్నింగ్స్ గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 72 బంతుల్లోనే 16 ఫోర్లు, 10 సిక్సర్లతో 172 పరుగులు చేసిన ఫించ్ అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.
అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్...
స్కాట్లాండ్ ఆటగాడు కాలమ్ మెక్లాయిడ్ ‘అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో అఫ్గానిస్తాన్‌పై 157 పరుగులు చేసిన అతను... ఇంగ్లండ్‌పై 140 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
ఇతర అవార్డుల్లో ‘స్పిరిట్ ఆఫ్ ద ఇయర్’ను విలియమ్సన్ (న్యూజి లాండ్) గెలుచుకోగా, కుమార ధర్మసేన (శ్రీలంక) ఉత్తమ అంపైర్‌గా నిలిచాడు. భారత యువ జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకోవడం ‘అభిమానుల అత్యుత్తమ క్షణం’గా ఎంపికైంది.

- ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని రెండోసారి నెగ్గిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. గతేడాది కూడా కోహ్లికి ఈ అవార్డు లభించింది. గతంలో రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ (2010), అశ్విన్ (2016) ఒక్కోసారి ఈ అవార్డు అందుకున్నారు.
- ఐసీసీ ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు మూడుసార్లు (2012, 2017, 2018) ఎంపికై న తొలి భారత క్రికెటర్ కోహ్లినే. ధోనికి (2008, 2009) రెండుసార్లు ఈ అవార్డు వచ్చింది.
- ఐసీసీ ‘టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు పొందిన ఐదో భారత క్రికెటర్ కోహ్లి. గతంలో రాహుల్ ద్రవిడ్ (2004), గంభీర్ (2009), సెహ్వాగ్ (2010), అశ్విన్ (2016) ఈ ఘనత సాధించారు.
ఎమర్జింగ్ క్రికెటర్‌గా పంత్...
టెస్టులు, వన్డేల్లో 2018లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వరించింది. అతను 8 టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించాడు.
అత్యుత్తమ ఇన్నింగ్స్...
హరారేలో జింబాబ్వేపై ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) చేసిన భారీ సెంచరీ టి20 అత్యుత్తమ ఇన్నింగ్స్ గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 72 బంతుల్లోనే 16 ఫోర్లు, 10 సిక్సర్లతో 172 పరుగులు చేసిన ఫించ్ అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.
అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్...
స్కాట్లాండ్ ఆటగాడు కాలమ్ మెక్లాయిడ్ ‘అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో అఫ్గానిస్తాన్‌పై 157 పరుగులు చేసిన అతను... ఇంగ్లండ్‌పై 140 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
ఇతర అవార్డుల్లో ‘స్పిరిట్ ఆఫ్ ద ఇయర్’ను విలియమ్సన్ (న్యూజి లాండ్) గెలుచుకోగా, కుమార ధర్మసేన (శ్రీలంక) ఉత్తమ అంపైర్‌గా నిలిచాడు. భారత యువ జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకోవడం ‘అభిమానుల అత్యుత్తమ క్షణం’గా ఎంపికైంది.
Published date : 31 Jan 2019 05:44PM