విండీస్ మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితులైన బౌలింగ్ దిగ్గజం?
Sakshi Education
రాబోయే రెండు ప్రపంచకప్ (వన్డే, టి20)లకు సన్నద్ధం... జట్టును మెరుగుపర్చడం కోసం బౌలింగ్ దిగ్గజం కోట్నీ వాల్ష్‌ను 2022 వరకు వెస్టిండీస్ మహిళల జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు.
గతంలో వాల్ష్ బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. 2020 ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన టి20 మహిళల ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ అమ్మాయిల బృందానికి తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు. 57 ఏళ్ల వాల్ష్ టెస్టు క్రికెట్లో 519 వికెట్లు తీసిన కరీబియన్ బౌలర్‌గా ఘనత వహించాడు. వన్డేల్లో 227 వికెట్లు తీసిన వాల్ష్ ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో కూడా స్థానం దక్కించుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెస్టిండీస్ మహిళల జట్టు హెడ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : బౌలింగ్ దిగ్గజం కోట్నీ వాల్ష్
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెస్టిండీస్ మహిళల జట్టు హెడ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : బౌలింగ్ దిగ్గజం కోట్నీ వాల్ష్
Published date : 03 Oct 2020 05:59PM