వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ రద్దు
Sakshi Education
కోవిడ్-19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులదృష్ట్యా... 2020, ఏడాది ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ లాన్‌టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్‌టీసీ) ఏప్రిల్ 1న ప్రకటించింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత...
వింబుల్డన్‌ను తొలిసారి 1877లో నిర్వహించారు. ఈ టోర్నీని మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1915 నుంచి 1918 వరకు, రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1940 నుంచి 1945 వరకు నిర్వహించలేదు. ఆ తర్వాత 1946 నుంచి ప్రతి యేటా వింబుల్డన్ నిరాటంకంగా కొనసాగింది. అయితే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో అందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని 2020 ఏడాది వింబుల్డన్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : ఆల్ ఇంగ్లండ్ లాన్‌టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్‌టీసీ)
ఎక్కడ : ఇంగ్లండ్
ఎందుకు : కోవిడ్-19 కారణంగా
షెడ్యూల్ ప్రకారం 2020 ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 29 నుంచి జూలై 12 వరకు జరగాల్సింది. 2021 ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 28 నుంచి జూలై 11 వరకు జరుగుతుందని ఏఈఎల్‌టీసీ తెలిపింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత...
వింబుల్డన్‌ను తొలిసారి 1877లో నిర్వహించారు. ఈ టోర్నీని మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1915 నుంచి 1918 వరకు, రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1940 నుంచి 1945 వరకు నిర్వహించలేదు. ఆ తర్వాత 1946 నుంచి ప్రతి యేటా వింబుల్డన్ నిరాటంకంగా కొనసాగింది. అయితే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో అందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని 2020 ఏడాది వింబుల్డన్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : ఆల్ ఇంగ్లండ్ లాన్‌టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్‌టీసీ)
ఎక్కడ : ఇంగ్లండ్
ఎందుకు : కోవిడ్-19 కారణంగా
Published date : 02 Apr 2020 03:06PM