Skip to main content

విమానాల నిర్వహణపై బోయింగ్ ఒప్పందం

భారత్‌లో విమానాల నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)తో కలిసి పదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు బోయింగ్ తెలియజేసింది.
ఈ రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు తాము సాంకేతిక సహకారం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక 18 నెలల్లో సిద్ధం కావచ్చని, అమెరికా ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(యూఎస్‌టీడీఏ) నిధులతో దీన్ని చేపట్టనున్నామని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏఏఐ నేతృత్వంలో 125 విమానాశ్రయాలను కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏఏఐ చైర్మన్‌గా గురుప్రసాద్ మొహపాత్రా వ్యవహరిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్‌లో విమానాల నిర్వహణ వ్యవస్థపై ఒప్పందం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), బోయింగ్
Published date : 05 Jun 2019 05:49PM

Photo Stories