Skip to main content

విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి కన్నుమూత

సుప్రసిద్ధ విలక్షణ నటుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి (74) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సెప్టెంబర్ 8న గుంటూరు విద్యానగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Current Affairsకర్నూలు జిల్లా, సిరివెళ్ల మండలం, వీరారెడ్డి పల్లెలో 1946, మే 8న జన్మించిన ప్రకాష్‌రెడ్డి 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. ప్రతి నాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రంగస్థల దిగ్గజంగా దాదాపు ఆరు దశాబ్దాలపాటు నటనా రంగంలో విశేష కృషి చేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 340 సినిమాలు, 3 వేల నాటకాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ యాసతో ఆయన నటనకు ఎనలేని గుర్తింపు వచ్చింది.

లవుడు ఇకలేరు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశేష ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రం లవకుశలో లవుడు పాత్ర పోషించిన నటుడు ఆనపర్తి నాగరాజు ఇకలేరు. హైదరాబాద్ గాంధీనగర్‌లో గుండెపోటుతో సెప్టెంబర్ 7న కన్నుమూశారు. 340కి పైగా చిత్రాల్లో నటించిన నాగరాజు అసలు పేరు.. నాగేందర్‌రావు. కీలుగుర్రం, హరిశ్చంద్ర సినిమాల్లో నటించిన ఏ.వీ.సుబ్బారావు కుమారుడే నాగరాజు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : సుప్రసిద్ధ విలక్షణ నటుడుకన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : తూర్పు జయప్రకాష్‌రెడ్డి (74)
ఎక్కడ : విద్యానగర్, గుంటూరు
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 09 Sep 2020 05:37PM

Photo Stories