విక్రాంత్ తొలి ప్రయాణం విజయవంతం
40 వేల టన్నుల బరువైన ఈ యుద్ధ నౌకలోని అన్ని వ్యవస్థలు కూడా సంతృప్తికరంగా పనిచేశాయని వెల్లడించారు. సుమారు రూ.23 వేల కోట్లు వెచ్చించి రూపొందించిన ఈ యుద్ధ నౌక ఆగస్టు 4న అరేబియా సముద్రం(కొచ్చిన్ షిప్‌యార్డు సమీపం)లో కీలకమైన సముద్ర ప్రయాణ పరీక్ష ప్రారంభించిందని చెప్పారు.
మిగ్–29కె యుద్ధ విమానాలు, కమోవ్–31 హెలికాప్టర్లు, ఎంహెచ్–60 ఆర్ హెలికాప్టర్లను విక్రాంత్ యుద్ధ నౌకపై నుంచి ప్రయోగించవచ్చు. గరిష్టంగా గంటకు 28 నాటికల్ మైళ్ల చొప్పున ఏకబిగిన 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. 2009లో కొచ్చిన్ షిప్‌యార్డులో నిర్మాణం ప్రారంభమైన ఈ యుద్ధ నౌక పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు, ఎత్తు 59 మీటర్లు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఏసీ విక్రాంత్ తొలి ప్రయాణం విజయవంతం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : భారత నావికాదళం
ఎక్కడ : కొచ్చిన్ షిప్‌యార్డు సమీపం, అరేబియా సముద్రం
ఎందుకు : యుద్ధ నౌక విక్రాంత్‌లోని అన్ని వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేస్తున్నాయా? లేదా? అని పరిశీలించే క్రమంలో భాగంగా...