Skip to main content

వికీపీడియాను నిర్వహిస్తోన్న సంస్థ పేరు?

ఆన్‌లైన్ సమాచార నిధి ‘వికీపీడియా’ భారత్ మార్కెట్ పట్ల దీర్ఘకాలిక దృష్టిని కలిగి ఉన్నట్టు ప్రకటించింది.
Current Affairsస్థానిక భాషా అవసరాలను అందుకోవడం ద్వారా మరింత మంది యూజర్లను వికీపీడియా ప్లాట్‌పామ్‌పైకి తీసుకురావాలని అనుకుంటున్నట్టు వికీమీడియా ఫౌండేషన్ సీఈవో క్యాథరిన్ మహేర్ జనవరి 15న తెలిపారు. భారత్ తమకు ఐదో అతిపెద్ద మార్కెట్ అని, భారత్ నుంచి ప్రతీ నెలా 75 కోట్ల పేజీ వీక్షనలు నమోదవుతున్నట్టు చెప్పారు.

వికీపీడియాను లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. 2020 జనవరి 15తో వికీపీడియా 20 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ అనే ఇద్దరు వ్యక్తులు దీనిని ప్రారంభించారు. ఇంటర్నెట్లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం వికీపీడియా... 300 భాషల్లో 5.5 కోట్లకు పైగా ఆర్టికల్స్‌ను, ఎటువంటి ప్రకటలు లేకుండా ఉచితంగా అందిస్తోంది. భారత్‌లో 24 భాషల్లో ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి.
Published date : 19 Jan 2021 05:52PM

Photo Stories