Skip to main content

విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం వాట్సాప్‌ను వినియోగించనున్న సంస్థ?

దేశంలోనే తొలిసారిగా విద్యుత్‌ బిల్లులను వాట్సాప్‌ నుంచే చెల్లించే సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్‌) అందుబాటులోకి తేనుంది.
Current Affairs

దీనికి వాట్సాప్‌ అఫీషియల్‌ బిజినెస్‌ అకౌంట్‌గా నామకరణం చేయనుంది. బిల్లుల చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు గాను వాట్సాప్‌ ద్వారా బిల్లు చెల్లించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్‌ అధికారులు తెలిపారు.


సరిహద్దుల్లో 12 వ్యూహాత్మక రహదారుల ప్రారంభం

చైనాతో సరిహద్దుల్లో నిర్మించిన 12 వ్యూహాత్మక రహదారులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జూన్‌ 17న జాతికి అంకితం చేశారు. సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌వో) ఈ రహదారులను నిర్మించింది. భారతదేశం ప్రపంచ శాంతికి బోధకుడు వంటిదన్న రక్షణమంత్రి..సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి ఎటువంటి అవరోధం వాటిల్లినా పరిణామాలు ప్రతికూలంగా ఉంటాయన్నారు. తాజా ప్రారంభించిన 12 రహదారుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో 10, లద్దాఖ్, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కోటి చొప్పున ఉన్నాయి.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : తొలిసారిగా విద్యుత్‌ బిల్లులను వాట్సాప్‌ నుంచే చెల్లించే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్న సంస్థ?
ఎప్పుడు : జూన్‌ 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్‌)
ఎక్కడ : దేశంలోనే
ఎందుకు : విద్యుత్‌ బిల్లుల చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు గాను...
Published date : 18 Jun 2021 06:16PM

Photo Stories