విద్యార్థుల కోసం ఎన్‌ఈఏటీ పథకం
Sakshi Education
ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు వచ్చేలా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు కేంద్రప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (ఎన్‌ఈఏటీ) అనే పథకాన్ని ప్రకటించింది.
2019, నవంబర్ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని సెప్టెంబర్ 19న వెల్లడించింది. విద్యార్థుల అవసరాల మేరకు వారి వ్యక్తిగత అభిరుచుల సహకరించేలా కృత్రిమ మేథస్సును ఉపయోగించడం ఈ పథకం లక్ష్యమని పేర్కొంది.
కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం...
క్విక్ రివ్యూ :
ఏమిటి : విద్యార్థుల కోసం ఎన్‌ఈఏటీ పథకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : కేంద్రప్రభుత్వం
కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం...
- ఎన్‌ఈఏటీలో భాగంగా స్టార్టప్ సంస్థలను ఒక వేదిక పైకి తెచ్చి తద్వారా సాంకేతికతను విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి తెస్తారు. తద్వారా విద్యార్థులు దీన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
- ఎడ్ టెక్ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సొల్యూషన్స్ తయారీ, విద్యార్థుల నమోదు కార్యక్రమాలు చూస్తాయి. విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా వసూలు చేస్తాయి.
- పథకంలో భాగంగా టెక్ కంపెనీలు మొత్తం సీట్లలో పేద విద్యార్థులకు 25 శాతం కేటాయించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విద్యార్థుల కోసం ఎన్‌ఈఏటీ పథకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : కేంద్రప్రభుత్వం
Published date : 20 Sep 2019 05:42PM