వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత మహిళా లిఫ్టర్?
Sakshi Education
ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చాను (49 కేజీలు) రెండు పతకాలను సొంతం చేసుకుంది.
ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో ఏప్రిల్ 17న మీరాబాయి... క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో స్వర్ణం, ఓవరాల్‌గా కాంస్య పతకం సాధించింది. క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లో మీరాబాయి 119 కేజీల బరువెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 118 కేజీలతో హుయ్‌హువా జియాంగ్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మీరాబాయి బద్దలు కొట్టింది.
స్నాచ్‌లో... మీరాబాయి 86 కేజీలు బరువెత్తి ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తంగా మీరాబాయి (86+119) 205 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
జిల్లీ దలబెహెరాకు మూడు స్వర్ణాలు...
ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఏప్రిల్ 18న జరిగిన మహిళల 45 కేజీల విభాగం ఈవెంట్లో భారత లిఫ్టర్ జిల్లీ దలబెహెరా... స్నాచ్‌లో, క్లీన్ అండ్ జెర్క్‌లో, ఓవరాల్‌గా అగ్రస్థానంలో నిలిచి మూడు పసిడి పతకాలు సాధించింది. ఒడిశాకు చెందిన జిల్లీ మొత్తం 157 కేజీలు (స్నాచ్‌లో 69+క్లీన్ అండ్ జెర్క్‌లో 88) బరువెత్తింది.
sd
ఏమిటి : వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత మహిళా లిఫ్టర్?
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : భారత మహిళా లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చాను
ఎక్కడ : ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్(తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్)
ఎందుకు : క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లో మీరాబాయి 119 కేజీల బరువెత్తినందున

Published date : 19 Apr 2021 06:19PM