వెస్టిండీస్ క్రికెటర్ పూరన్‌పై నిషేధం
Sakshi Education
వెస్టిండీస్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
లక్నోలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో అతను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్ అంగీకరించడంతో క్షమాపణలు కూడా కోరాడు. సస్పెన్షన్ కారణంగా విండీస్ ఆటగాడు తదుపరి నాలుగు టి20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్-3 నిబంధనను అతిక్రమించడంతో ఆర్టికల్ 2.14 ప్రకారం నాలుగు సస్పెన్షన్ పాయింట్లను విధించామని ఐసీసీ నవంబర్ 13న ఒక ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెస్టిండీస్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌పై నిషేదం
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)
ఎందుకు : బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెస్టిండీస్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌పై నిషేదం
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)
ఎందుకు : బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో
Published date : 14 Nov 2019 05:39PM