వెనెజువెలా అధ్యక్షుడితో వెంకయ్య భేటీ
Sakshi Education
18వ అలీనోద్యమ దేశాధినేతల(నాన్ అలైన్‌డ్ మూవ్‌మెంట్-నామ్) సదస్సు సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో భేటీ అయ్యారు.
ఈ సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక బంధాల బలోపేతం, ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ‘నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు - బాన్‌డుంగ్(ఇండోనేషియా) సూత్రాలు అమలు’ అనే ఇతివృత్తంతో అజర్‌బైజాన్ రాజధాని బాకులో అక్టోబర్ 25, 26 తేదీల్లో నామ్ సదస్సును నిర్వహించారు.
మరోవైపు అగ్ని ఆరాధకుల మందిరంగా ప్రసిద్ధికెక్కిన బాకులోని పురాతన అతెష్గాను వెంకయ్య అక్టోబర్ 26న సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నిత్యం జ్వలించే ఈ అగ్ని పీఠం, రాతి గదులతో కూడిన ఆలయం భారత్- అజర్‌బైజాన్ దేశాల ప్రజల సాంస్కృతిక చిహ్నంగా వెలుగొందుతోందన్నారు. ప్రాచీనమైన ఈ ఆలయంలో గణేశుడు, సరస్వతి మంత్రాలను సంస్కృతంలో వినడం ఎంతో ఆనందదాయకమన్నారు. గోడలపై చెక్కిన చిత్రాలు విభిన్న మతాల మధ్య సారూప్యతను తెలియజేస్తున్నాయన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : బాకు, అజర్‌బైజాన్

Published date : 28 Oct 2019 05:35PM