Skip to main content

వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో ఏపీకి అగ్రస్థానం

ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో భాగంగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 66 మార్కులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
Current Affairsఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్ షీల్ రాష్ట్రానికి లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యసేవలు అందించడం, వారి వివరాలను నమోదు చేయడం, వాటిని కేంద్ర ఆరోగ్య శాఖ పోర్టల్‌కు అనుసంధానించడం వంటి విషయాల్లో ఏపీ మంచి ప్రతిభ కనబరిచినట్టు లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రధానమంత్రి మాతృవందన యోజనలోనూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంక్ వచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణకు 19వ స్థానం...
2019 డిసెంబర్, 2020 జనవరి నెలలకు సంబంధించి హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో రాష్ట్రాల ప్రతిభను లెక్కించారు. ఇందులో 58 మార్కులతో గోవా, తమిళనాడు రెండో స్థానంలో, 57 మార్కులతో గుజరాత్ మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 37 మార్కులతో 19వ స్థానంలో నిలిచింది.

రెండు రకాల సేవలు...
ఆయుష్మాన్ భారత్ పథకం రెండు రకాల సేవలు ఉంటాయి. ఒకటి.. జన ఆరోగ్య యోజన (ఆరోగ్యశ్రీ తరహా) కాగా రెండోది హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ.

వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో టాప్-10 రాష్ట్రాలు

రాష్ట్రం

మార్కులు

ఆంధ్రప్రదేశ్

66

గోవా, తమిళనాడు

58

గుజరాత్

57

ఒడిశా, పంజాబ్

54

హరియాణా

53

ఛత్తీస్‌గఢ్

52

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్

48

అసోం

47

కర్ణాటక, సిక్కిం

44

త్రిపుర

41

Published date : 19 Feb 2020 06:05PM

Photo Stories