వేయి పడగల మేధావి పుస్తక రచయిత ఎవరు?
Sakshi Education
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జీవితం ఆధారంగా సీనియర్ జర్నలిస్టు వి.చంద్రశేఖరరావు రచించిన ‘వేయి పడగల మేధావి’ పుస్తకం విడుదలైంది.
నవంబర్ 3న హైదరబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీవీ గొప్ప సాహితీమూర్తి అని, భారత జాతి ఖ్యాతిని దశదిశలా చాటిన పరిపాలనాధ్యక్షుడని కేశవరావు పేర్కొన్నారు.
చదవండి:
పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
ఏ కేంద్రీయ వర్సిటీకి మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వేయి పడగల మేధావి పుస్తక రచయిత ఎవరు?
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : సీనియర్ జర్నలిస్టు వి.చంద్రశేఖరరావు
ఎక్కడ : రవీంద్రభారతి, హైదరాబాద్
ఎందుకు : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జీవితం ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించారు.
Published date : 04 Nov 2020 05:53PM