వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా సూరత్
Sakshi Education
దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా గుజరాత్‌లోని సూరత్ నిలిచింది.
ఆగ్రా, బెంగళూరు, హైదరాబాద్‌లు వరుసగా సూరత్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అక్టోబర్ 3న ఈ సర్వేను విడుదల చేశారు. ప్రపంచంలోని మొత్తం 780 నగరాలను పరిశీలించి ఆక్స్‌ఫర్డ్ సర్వేను రూపొందించారు.
దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలు
నోట్: జీడీపీ గణాంకాలు బిలియన్ డాలర్లలో. ఒక బిలియన్ రూ.100 కోట్లకు సమానం
ప్రపంచ నగరాలలో 2018 జీడీపీ (ట్రిలియన్ డాలర్లలో)
దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలు
ర్యాంకు | నగరం | వృద్ధిరేటు(2019-35) | జీడీపీ 2018 | జీడీపీ 2035 |
1 | సూరత్ | 9.17 | 28.5 | 126.8 |
2 | ఆగ్రా | 8.58 | 3.9 | 15.6 |
3 | బెంగళూరు | 8.50 | 70.8 | 283.3 |
4 | హైదరాబాద్ | 8.47 | 50.6 | 201.4 |
5 | నాగ్‌పూర్ | 8.41 | 12.3 | 48.6 |
6 | తిరుపూర్ | 8.36 | 4.3 | 17.0 |
7 | రాజ్‌కోట్ | 8.33 | 6.8 | 26.7 |
8 | తిరుచిరాపల్లి | 8.29 | 4.9 | 19.0 |
9 | చెన్నై | 8.17 | 36.0 | 136.8 |
10 | విజయవాడ | 8.16 | 5.6 | 21.3 |
ప్రపంచ నగరాలలో 2018 జీడీపీ (ట్రిలియన్ డాలర్లలో)
న్యూయార్క్ | 2.5 |
టోక్యో | 1.9 |
లాస్‌ఏంజెల్స్ | 1.5 |
లండన్ | 1.3 |
షాంఘై | 1.3 |
బీజింగ్ | 1.1 |
పారిస్ | 1.1 |
చికాగో | 1.0 |
గుహాంగ్‌జో | 0.9 |
షెన్‌ఝన్ | 0.9 |
నోట్: ఒక ట్రిలియన్ డాలర్లు లక్ష కోట్ల డాలర్లకు సమానం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా సూరత్
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్ సర్వే
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా సూరత్
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్ సర్వే
Published date : 04 Oct 2019 05:34PM