వేగంగా భారత్ ఎకానమీ రికవరీ: ఎస్‌బీఐ
Sakshi Education
భారత్ ఎకానమీ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతోందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధనా నివేదిక వివరించింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇంతక్రితం ఎకానమీ 7.4 శాతం క్షీణ అంచనాలను మైనస్ 7 శాతానికి మెరుగుపరచినట్లు ఫిబ్రవరి 10న వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంచనావేసింది.
ఇండియా రేటింగ్స్...
భారత్ ఎకానమీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని ఇండియా రేటింగ్‌స అండ్ రీసెర్చ్ ఫిబ్రవరి 10న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఎకానమీ 7.8 శాతం క్షీణిస్తుందని వివరించింది.
ఫిచ్ రేటింగ్స్...
2021-22లో భారత్ 11 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని అంచనావేస్తున్న ఫిచ్ రేటింగ్‌స, 2025-26 వరకూ దాదాపు 6.5 శాతంగానే వృద్ధి రేటు ఉంటుందని భావిస్తోంది.
Published date : 11 Feb 2021 05:57PM